
ప్రజలకు నిత్యం అండగా ఉండాలి
కొత్తగూడెంటౌన్: భారీ వర్షాలు కురుస్తున్న విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు నిత్యం అందుబాటులో, అండగా ఉండాలని ఎస్పీ రోహిత్‌రాజు అన్నారు. డీడీఆర్‌ఎఫ్, అగ్నిమాపక శాఖ అధికారులతో గురువారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ.. రాబోయే వర్షాలదృష్యా ప్రమాదవశాత్తు వరదల్లో చిక్కుకునే వారిని రక్షించడానికి పోలీసులతో పాటు అందరూ సిద్ధంగా ఉండాలన్నారు. జిల్లాలో ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి ప్రత్యేకంగా శిక్షణ పొందిన డీడీఆర్‌ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. రెస్యూ సమయంలో అవసరమైన లైఫ్ జాకెట్లు, రోప్‌ల వంటి సామగ్రిని సమకూర్చుతామని తెలిపారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ నరేందర్, జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి మురహరి క్రాంతికుమార్, ఆరో బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ శ్రీనివాస్, ఆర్‌ఐ రవి తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ రోహిత్‌రాజు