
నియోజకవర్గాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి
దమ్మపేట : అశ్వారావుపేట నియోజకవర్గాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. గురువారం మండలంలోని గండుగులపల్లి నివాసంలో మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే జారేతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో అవసరమైన చోట రహదారులు, సెంట్రల్ లైటింగ్, సీసీ రోడ్లు తదితర అభివృద్ధి పనులను చేపట్టాలని సూచించారు. అంతకుముందుగా మంత్రి తుమ్మలను, సత్తుపల్లి నూతన పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ తుమ్మలపల్లి శ్రీహరి మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో తహసీల్దార్లు, విద్యుత్ , పంచాయతీరాజ్, అటవీ శాఖల అధికారులు, మాజీ జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు అలపాటి ప్రసాద్, కొయ్యల అచ్యుతరావు, కాసాని నాగప్రసాద్, కేవీ సత్యనారాయణ, ఎర్రా వసంతరావు, మన్నెం అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు