
తెగిపోయిన డైవర్షన్ రోడ్డు
ములకలపల్లి: ములకలపల్లి శివారులో ఊరవాగుపై వేసిన డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోయింది. తాజా వర్షాలతో కోత ఏర్పడగా తాళ్లపాయ జీపీపాటు, రింగిరెడ్డిపల్లి, బూర్గుకొయ్యగుంపు, మధ్యగుంపు, మంగలిగుట్ట, సుందర్‌నగర్ తదితర గ్రామాలకు వెళ్లే వాహనాలకు దారి మూసుకుపోయింది. ఈ వాగుపై రెండేళ్ల కిందట హైలెవెల్ వంతెన నిర్మాణం మొదలుపెట్టినా నేటికీ పూర్తి కాలేదు. గతేడాది పలుమార్లు డైవర్షన్ రోడ్డు తెగిపోవడంతో ఇనుప వంతెన వేశారు. కానీ, దీనిపైకి చేరే మార్గం బురదమయం కావడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. కాగా, వాగు వద్ద తెగిన డైవర్షన్ రోడ్డును ఎంపీడీఓ సత్యనారాయణ, ఎంపీఓ వెంకటేశ్వర్లు పరిశీలించారు.
బురదలో ప్రజల పాట్లు