
గోదావరి, జలాశయాలకు వరద..
భద్రాచలంటౌన్/పాల్వంచరూరల్/అశ్వారావుపేటరూరల్/టేకులపల్లి: రెండు, మూడు రోజులుగా ఎగువన, పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వరద ప్రవాహం పెరుగుతోంది. భద్రాచలం వద్ద గోదావరిలో మంగళవారం రాత్రికి 13 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం బుధవారం రాత్రి 12 అడుగులకు తగ్గి నిలకడగా ప్రవహిస్తోంది. కిన్నెరసాని ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 407 అడుగులు కాగా, ఎగువ ప్రాంతాల నుంచి 4,200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. జలాశయం నీటిమట్టం మంగళవారం 396.80 అడుగులు ఉండగా, బుధవారం 397.50 అడుగులకు పెరిగింది. అశ్వారావుపేటలోని పెదవాగు ప్రాజెక్ట్‌కు వరద పోటెత్తగా రింగ్‌బండ్ జలకళ సంతరించుకుంది. రింగ్‌బండ్ లెవల్ దాటితే నీళ్లు క్రస్ట్ గేట్ల నుంచి బయటకు వెళ్తున్నాయి. వర్షంతో టేకులపల్లిలోని సింగరేణి కేఓసీలో 8,269 టన్నుల బొగ్గు ఉత్పత్తితోపాటు ఓబీ వెలికితీత నిలిచిపోయింది. ఓసీలోని నీటిని ఎత్తిపోస్తున్నారు.

గోదావరి, జలాశయాలకు వరద..