
విలీన వార్డుల్లో బురద..
ఇల్లెందు: ఇల్లెందు మున్సిపాలిటీలోని నాలుగు విలీన వార్డులు ఉన్నాయి. వీటిల్లో అన్నీ కచ్చా రోడ్లే ఉండటంతో వర్షాకాలంలో బురదలో నడవాల్సిందే. చినుకు పడితే నేలంతా చిత్తడిగా మారుతోంది. పట్టణంలోని 1వ వార్డు సత్యనారాయణపురం పూర్తిగా సుదిమళ్ల గ్రామపంచాయతీ నుంచి మున్సిపాలిటీలో విలీనం చేశారు. 2వ వార్డు, 22వ వార్డులో, 23వ వార్డుల్లో కూడా విలీన గ్రామాలే ఉన్నాయి. వీటిల్లో ఇప్పటికీ కచ్చా రోడ్లు ఉన్నాయి. గ్రామపంచాయతీలుగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన రోడ్లే తప్ప మున్సిపాలిటీలో విలీనం చేశాక కొత్తగా రోడ్లు నిర్మించలేదు. దీంతో పాటు పట్టణంలోని 24 వార్డుల్లో మిషన్ భగీరథ పైపులైన్ పనుల కోసం రోడ్లు తవ్విన ప్రదేశాలు గుంతలమయంగా మారాయి.
కాలుబయట పెట్టలేం
సత్యనారాయణపురంలో వానాకాలంలో అడుగు బయట పెట్టాలంటే బురదలో దిగాల్సిందే. చినుకు పడితే నేలంతా చిత్తడిగా మారుతుంది. విలీన వార్డుల్లో అన్ని మట్టి రోడ్లే ఉన్నాయి. బీటీ రోడ్లు నిర్మించాలి.
– బి.గోపి, 1వ వార్డు, ఇల్లెందు
●

విలీన వార్డుల్లో బురద..