
కాలినడకా కష్టమే
అశ్వారావుపేట: మున్సిపాలిటీ పరిధిలోని మోడల్ కాలనీ, పాత పేరాయిగూడెం, దొంతికుంట, అటెండర్స్ కాలనీ, ఏఎస్‌ఆర్ కాలనీ, బీఎస్‌ఆర్ నగర్ ప్రాంతాల్లో అంతర్గత రహదారులు అధ్వానంగా ఉన్నాయి. సీసీ రహదారులు నిర్మించకపోవడంతో వర్షాకాలంలో కాలినడక కూడా కష్టంగానే ఉంటోంది. పేద, మధ్యతరగతి ప్రజలు నివాసం ఉండే ప్రాంతాల్లో రోడ్లు నిర్మించడంలేదని ఆయా ప్రాంతాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాత్రి వేళల్లో నడక కష్టమే
మోడల్ కాలనీలో అన్ని వీధుల్లో సీసీ రహదారులు నిర్మించలేదు. గుంతలు, పిచ్చిమొక్కలతో ఇబ్బందిగా ఉంటోంది. పాములు సంచరిస్తున్నాయి. రాత్రి వేళల్లో రాకపోకలు సాగించాలంటే భయంగా ఉంటోంది.
–ఆదినారాయణ, మోడల్ కాలనీ
●

కాలినడకా కష్టమే