
చెత్త వేసే చోటే లేదు..
అశ్వారావుపేట: అశ్వారావుపేట మున్సిపాలిటీలో నిత్యం వెలువడే చెత్త వేసేందుకు డంపింగ్ యార్డు ఉన్నా.. అది నిండిపోయి వాహనాలు వెళ్లే పరిస్థితి లేదు. దీంతో యార్డుకు వెళ్లే దారిలోని వ్యవసాయ భూముల్లోనే వేస్తున్నారు. పేరుకు రెండెకరాల డంపింగ్ యార్డు ఉన్నా.. రోడ్డు పక్కనే చెత్త వేస్తుండడంతో మెరుపు కాలనీ, అటెండర్స్ కాలనీ, కోతమిషన్ బజారు వాసులు దుర్వాసన భరించలేకపోతున్నారు. చెత్త కాలిస్తే పొగ, ఈగల బెడద తీవ్రంగా ఉందని వాపోతున్నారు. పట్టణంలో చెత్త సేకరణకు 3 ట్రాక్టర్లు, 7 ట్రాలీలు వినియోగిస్తున్నారు. వీటి నిర్వహణకు నెలకు రూ.లక్ష డీజిల్‌కు, 40 మంది పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు రూ.6.64 లక్షలు వ్యయం అవుతోంది.
ఎవరికి చెప్పాలో తెలియడం లేదు
చెత్తను మా కాలనీ పక్కనే వేస్తున్నారు. ట్రాక్టర్లు, ఆటోలు వెళ్లేటపుడు వీధుల్లో పడుతోంది. రోజూ తగలబెడుతుండగా తట్టుకోలేని పొగ, కంపు కొడుతోంది. ఇంటి నిండా ఈగలు ముసురుతుంటాయి. మా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు.
– కోరుకొండ రాజేశ్వరి, మెరుపు కాలనీ
●

చెత్త వేసే చోటే లేదు..