
ఉద్దీపనం పుస్తకాల్లో నాణ్యత ఉండాలి
భద్రాచలం : విద్యార్థులకు అందించే ఉద్దీపనం పుస్తకాల్లో నాణ్యత పాటించాలని ఐటీడీఏ పీఓ బి. రాహుల్ అన్నారు. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ప్రాథమిక, ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల కోసం రూపొందించిన ఈ పుస్తకాల ముద్రణ టెండర్లను తన చాంబర్‌లో మంగళవారం ఆయన ఖరారు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం పుస్తకాలు ముద్రించాలని సూచించారు. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు 30,89,784 వర్క్‌బుక్‌లు ముద్రించి ఆయా పాఠశాలలకు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ డీడీ మణెమ్మ, ఏసీఎంఓ రమేష్, జీసీసీ డీఎం జయరాజ్, ఏటీడీఓ అశోక్ కుమార్‌తో పాటు ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, పాల్వంచ మండలాలకఉ చెందిన ప్రింటింగ్ ప్రెస్ యజమానులు తదితరులు పాల్గొన్నారు.
7న అశ్వారావుపేటలో గిరిజన దర్బార్
మారుమూల గ్రామాలకు చెందిన ఆదివాసీ గిరిజన కుటుంబాల సౌకర్యార్థం ఈనెల 7న అశ్వారావుపేటలో గిరిజన దర్బార్ నిర్వహించనున్నట్లు పీఓ రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు, యూనిట్ అధికారులు పూర్తి నివేదికలతో సోమవారం ఉదయం 10 గంటలకు అశ్వారావుపేట ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకోవాలని సూచించారు. అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ మండలాల గిరిజనులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గిరిజన దర్బార్‌పై విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులను ఆయన ఆదేశించారు.
ఐటీడీఏ పీఓ రాహుల్