
● చెత్త వాహనాలు ఐదే..
మణుగూరు టౌన్: మున్సిపాలిటీ పరిధిలో చెత్త సేకరణ తూతూ మంత్రంగానే సాగుతోంది. పట్టణంలో 20 వార్డులు ఉండగా, ప్రధాన వార్డుల్లో ఒకటైన సుందరయ్యనగర్‌లో చెత్త ఎక్కడికక్కడే పేరుకుపోయింది. ముఖ్య వీధులకు మాత్రమే వారంలో రెండు సార్లు చెత్త సేకరణ ఆటోలు వస్తున్నాయి. మొత్తం మున్సిపాలిటీలో చెత్త సేకరణ వాహనాలు ఐదే ఉండగా అవి ఎటూ సరిపోవడం లేదు. గాంధీనగర్‌లోనూ అదే పరిస్థితి. చెత్త సేకరణ వాహనాలు రాక ప్రజలు ఖాళీ ప్రదేశాల్లో పడేస్తున్నారు. దీంతో అటువైపు వెళ్లాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది. ఇక డ్రెయినేజీలను పట్టించుకునే నాథుడే లేడు.
దోమల బారిన పడుతున్నాం
సుందరయ్యనగర్‌లో కొన్ని వార్డుల్లో మాత్రమే రెండు రోజులకోసారి చెత్త బండ్లు వస్తున్నాయి. లోపలి వీధులకు మాత్రం 20 రోజులకోసారి వస్తున్నారు. కాల్వల్లో మురుగునీరు నిలిచి దోమలు వృద్ధి చెందుతున్నాయి. వాటి బారిన పడితే వ్యాధులు వస్తాయని భయంగా ఉంది.
–లక్ష్మి, సుందరయ్యనగర్
●