
కార్మిక శ్రేయస్సుకు నిరంతరం కృషి
ఇల్లెందు: ఇల్లెందు ఏరియా సింగరేణి ఉద్యోగి, ఐఎన్‌టీయూసీ నాయకుడు కళ్లం కోటిరెడ్డి నిరంతరం సింగరే ణి అఽభివృద్ధి, కార్మిక శ్రేయ స్సు కోసం పాటుపడ్డారని సింగరేణి ఇల్లెందు ఏరియా జీఎం వీసం కృష్ణయ్య పేర్కొన్నారు. సోమవారం ఇల్లెందు జేకే ఓసీలో ఉద్యోగ విరమణ పొందిన ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ కోటిరెడ్డి హక్కుల సాధనకు కృషి చేశాడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు జాకీర్ హుస్సేన్, చిన్నయ్య, నాయకులు లచ్చిరామ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జేకే సీఈఆర్ క్లబ్‌లో గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ చైర్మన్ మడత రమా వెంకట్‌గౌడ్ మాట్లాడుతూ సింగరేణి ఉద్యోగంలో చేరిన నాటి నుంచి నేటివరకు ఇల్లెందు ప్రజలకు, కార్మికులకు ఎంతో సేవ చేశారని పేర్కొన్నారు. అనంతరం కళ్లం కోటిరెడ్డి మాట్లాడుతూ 42 ఏళ్ల పాటు ఇల్లెందు ఏరియాలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన తాను ఈ ప్రాంత అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశానని, కార్మికుల సంక్షేమం, సింగరేణి అభివృద్ధికి పాటుపడ్డానని తెలిపారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య, మడత వెంకట్‌గౌడ్‌ల సారథ్యంలో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ సెంట్రల్ జనరల్ త్యాగరాజ్, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, యదళ్లపల్లి అనసూర్య, మాజీ వైస్ చైర్మన్‌లు మడత వెంకట్‌గౌడ్, బాస శ్రీనివాసరావు, సయ్యద్ జానీపాషా, వివిధ రాజకీయ పార్టీల నాయకులు అబ్దుల్ నబీ, నాయి ని రాజు, ఎస్‌కె జానీ, డానియేల్, పులి సైదులు, కార్మిక నాయకులు జే. వెంకటేశ్వర్లు, కె సారయ్య, నజీర్ అహ్మద్, ఎస్ రంగనాధ్, దిండిగాల రాజేందర్, పులిగళ్ల మాధవరావు, పత్తి స్వప్న, ఇమామ్, కుటుంబ సభ్యులు కళ్లం అమరనాఽథ్, శాలినీ రెడ్డి, మురళీరెడ్డి, లావణ్య పాల్గొన్నారు.
రెండు లారీలు ఢీ : డ్రైవర్లకు గాయాలు
బూర్గంపాడు: సారపాక పుష్కరవనం సమీపంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు గాయాలపాలయ్యారు. రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొని రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారమందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని లారీ కేబిన్లలో ఇరుక్కుపోయి గాయాలైన డ్రైవర్లను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. లారీలను తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
జీఎం వీసం కృష్ణయ్య