
కాంగ్రెస్‌తోనే అభివృద్ధి
ములకలపల్లి: కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే జారె ఆదినారాయణతో కలిసి సోమవారం మండలకేంద్రంతోపాటు మాధారం, జగన్నాథపురం, పాతగంగారం, సీతాయిగూడెం, కమలాపురం, చాపరాలపల్లి, రామచంద్రాపురం గ్రామాల్లో సోమవారం విస్తృతంగా పర్యటించారు. రూ 2.68 కోట్లతో నిర్మించిన కార్యాలయ భవనాలు, సీసీ రోడ్లను ప్రారంభించారు. అభివృద్ధి పనుల శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నివర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తాండ్ర ప్రభాకర్‌రావు, మాజీ జెడ్పీటీసీ బత్తుల అంజి, కారం సుధీర్, శనగపాటి అంజి, నాగళ్ల వెంకటేశ్వరరావు, గాడి తిరుపతి రెడ్డి, గుంపుల రవితేజ, సురభి రాజేశ్, పాలకుర్తి సుమిత్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి