
అమ్మవారికి విశేష పూజలు
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూలైన్ ద్వారా భక్తులు దర్శించుకుని అమ్మవారికి ఒడిబియ్యం, తలనీలాలు, చీరలు, పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించగా, భక్తులు బోనాలు, సారె సమర్పించారు. ఈఓ ఎన్.రజనీకుమారి, ఆలయకమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, డైరెక్టర్లు పాల్గొన్నారు.
కిన్నెరసానిలో
పర్యాటక సందడి
పాల్వంచరూరల్: కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కిన్నెరసానికి సందర్శకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యామ్, జలాశయం, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. రోజంతా సరదాగా గడిపారు. 537 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్‌లైఫ్ శాఖకు రూ.29,100 ఆదాయం లభించగా, 250 మంది బోటుషికారు చేయగా టూరి జం కార్పొరేషన్ సంస్థకు రూ.14,060 ఆదా యం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.

అమ్మవారికి విశేష పూజలు