
ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపాలి
కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు
రాష్ట్ర మంత్రి తుమ్మల వినతి
భద్రాచలం: పునర్విభజనలో భాగంగా ఏపీలో కలిసిన ఐదు పంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వినతిపత్రం అందజేశారు. నిజామాబాద్‌లో పసుపుబోర్డు ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. ఏపీలో కలిపిన భద్రాచలం చుట్టుపక్కల గ్రామాలైన ఎటపాక, కన్నాయిగూడం, పిచుకలపాడు, గుండాల, పురుషోత్తపట్నంలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని కోరారు. వీటివల్ల పరిపాలన, అభివృద్ధి పనుల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. భద్రాచలం, ఇతర మండలాల మధ్య రవాణా అంతరాయం ఏర్పడుతోందని, భద్రాచలంలో చదివే గిరిజన విద్యార్థులకు రాకపోకల్లో ఇబ్బందులు కలుగుతున్నాయని వివరించారు.