
అలనాటి ప్రాభవమేది..?
వేణుగోపాలా..
వెండిపూలతో పూజలు
జిల్లా చరిత్రపై ఇప్పటికీ సరైన పరిశోధనలు జరగడం లేదు. పాల్వంచ సంస్థానం కేంద్రంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం, అంతకు ముందు నైజాం జమానాలో చర్ల కేంద్రంగా కొనసాగిన పాలన, బొగ్గు గనుల పేరుతో ఇల్లెందులో బ్రిటీషర్లు వదిలి వెళ్లిన గుర్తులు ఇప్పటికీ ఈజిల్లా వాసులకు పెద్దగా తెలియ దు. అంతకుముందు చోళులు, రాష్ట్రకూటులు, కాకతీయుల కాలంలో చోటు చేసుకున్న సంఘటనలు చరిత్రలో కలిసిపోయినప్పటికీ.. ఇంకా మౌనసాక్షులుగా మోతె వీరభద్రస్వామి ఆలయం, ఇరవెండి సంతాన వేణుగోపాలస్వామి ఆలయాలు నిలిచి ఉన్నా యి. గోదావరి తీరం వెంబడి మోతె పరిపాలన కేంద్రంగా ఉంటే ఇరవెండి గ్రామం అగ్రహారంగా ఉండేదని తెలుస్తోంది. ఇక్కడున్న సంతాన వేణుగోపాల స్వామికి వెండి పూలతో ప్రతీ రోజు అర్చన చేయడంతో ఈ గ్రామానికి ఇరవెండి అనే పేరు స్థిరపడిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు.
1400 ఏళ్లకు పూర్వం
సంతాన వేణుగోపాల స్వామి ఆలయం 1400 ఏళ్లకు పూర్వం నాటిదని ఇక్కడ పూజలు నిర్వహించే అర్చకులు చెబుతున్నారు. వైష్ణవఆలయాల్లో నిర్మించే లక్ష్మీ మండప ద్వారం.. ఆలయ నిర్మాణం జరిగిన వెయ్యేళ్లకు కచ్చితంగా పగులుతుందని ఆగమ శాస్త్రాల్లో పేర్కొన్నారంటూ ఇక్కడున్న ఆలయ ద్వారానికి కూ డా పగులు ఉండటాన్ని వారు ఉదహరిస్తున్నారు. దీనికి తోడు పాల్వంచ తహసీల్దార్‌గా ఈ ప్రాంతానికి వచ్చిన కంచర్ల గోపన్న నేలకొండపల్లిలో ఉన్నప్పుడు వేణుగోపాలుడి భక్తుడని, భద్రాచలంలో సీతా సమే త శ్రీరాముడికి ఆలయం నిర్మించే ముందు తరుచుగా ఇరవెండి వేణుగోపాలుడిని దర్శించుకునేవాడని భద్రాచలం వాసులు చెబుతున్నారు. ఇక్కడ వేణుగోపాలస్వామి ఆలయ నమూనాలోనే భద్రాచలం ఆలయం కూడా ఉంటుందని వారు అంటున్నారు. లక్ష్మీ మంటప ద్వారం పగుళ్లు, భక్త రామదాసు (కంచర్ల గోపన్న)ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ ఆలయానికి 1400 ఏళ్లకు పైగా చరిత్ర ఉందని, చోళుల కాలంలో నిర్మించి ఉంటారని అంచనా వేస్తున్నారు.
వరదలతో..
గోదావరి తీరంలో ఎత్తైన కొండపై ఉన్న సంతాన వేణుగోపాలస్వామి ఆలయంలో ఉత్సవాలు జరిగి ప్పుడు వంద కేజీల నువ్వులు, బెల్లం ప్రసాదం తయారు చేసిన సరిపోదనే కథ ప్రచారంలో ఉంది. గోదావరికి వరదలొచ్చినప్పుడు ఆల యం ముంపున కు గురి కాలేదని, కానీ చుట్టూ ఉన్న ఊళ్లు ముని గిపోయాయని, అలా నెమ్మదిగా ఇక్కడున్న వారు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారని స్థానికులు చెబు తున్నారు. ముఖ్యంగా 1953, 1986లలో వచ్చిన వరదలతో ఈ చారిత్రక ఆలయం క్రమంగా తన ప్రాభవం కోల్పోయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉదయం, సాయంత్రం ధూపదీప నైవేద్యాలకే ఈ ఆలయం పరిమితమవుతోంది. హోలీ పండుగ సమయంలో ఇక్కడ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణుడికి ఘనంగా పెళ్లి వేడుక జరిపిస్తారు. అప్పుడు భక్తులతో ఈ ప్రాంతం కళకళలాడుతుంది.
ప్రచారం కల్పిస్తే
దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం పుణ్యతీర్థానికి కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలో మోతె వీరభద్రుడు, 13 కిలోమీటర్ల దూరంలో ఇరవెండి వేణుగోపాలస్వామి ఆలయాలు ఉన్నాయి. వీటికి సంబంధించిన చరిత్రపై శాసీ్త్రయ ఆధారాలు సంపాదించి, సరైన రీతిలో ప్రచారం చేసి, మౌలిక సదుపాయాలు కల్పిస్తే పర్యాటకం పరంగా భద్రాచలం ప్రాంతానికి మరింత గుర్తింపు వస్తుందనడంలో సందేహం లేదు.
ఇరవెండిలో శతాబ్దాలనాటి
సంతాన వేణుగోపాలస్వామి ఆలయం
ఒకప్పుడు వెండిపూలతో
నిత్యం అర్చనలు
ప్రస్తుతం ధూపదీప నైవేద్యాలకే పరిమితం
చారిత్రక ప్రాంతాలపై దృష్టి పెట్టని
జిల్లా అధికారులు
అనాదిగా నదీ తీరాలు నాగరికతకు
కేంద్రాలుగా వర్థిలాయి. ఇదే ఒరవడిలో గోదావరి నది వెంబడి ఒకప్పుడు వెలుగు వెలిగిన ప్రదేశాలు ఆనాటి ప్రాభవం
కోల్పోయాయి. ఇందుకు బూర్గంపాడు
మండలంలోని మోతె వీరభద్రస్వామి,
ఇరవెండి సంతాన వేణుగోపాల స్వామి
ఆలయాలే నిదర్శనంగా చెప్పవచ్చు.
–సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం
కానరాని పరిశోధనలు
ఇరవెండి సంతాన వేణుగోపాలస్వామి, మోతె వీరభద్రుడి ఆలయాల నిర్మాణ శైలిని పరిశీలిస్తే కాకతీయు కాలం లేదా అంతకంటే ముందువని పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఈ ఆలయాలను ఎవరు నిర్మించారు? ఏ కాలంలో నిర్మించారనే ఆధారాలు శిలాశాసన రూపంలోకానీ, గ్రంథ రూపంలో కానీ లభ్యం కాలేదు. భక్తరామదాసు రచనలు, రామదాసు గురించి ఇతరుల రచనల్లో కూడా ఈ ఆలయాల ప్రస్తావన లేదు. ఘనమైన చరిత్ర కలిగిన ఈ ఆలయాలు వారసత్వ సంపదగా ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఇక్కడి చరిత్రపై పరిశోధనలు చేసే బృందాలు పెరిగాయి. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాలు కేంద్రంగా రీసెర్చులు జరుగుతున్నాయి. భద్రాద్రి జిల్లా విషయంలోనూ ఈ తరహా పరిశోధనలకు ప్రోత్సాహం అందివ్వాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉంది.

అలనాటి ప్రాభవమేది..?

అలనాటి ప్రాభవమేది..?