
బీమాతో ఎస్‌హెచ్‌జీ సభ్యులకు ప్రయోజనం
చుంచుపల్లి: మహిళా స్వయం సహాయక సంఘాలకు శుక్రవారం కలెక్టరేట్‌లో ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన ఇన్సూరెన్స్ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్‌డీఓ ఎం.విద్యాచందన మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులకు రూ.20 ప్రీమియంతో బీమా సౌకర్యాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందన్నానరు. చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, పాల్వంచ, టేకులపల్లి మండలాలకు చెందిన స్వయం సహాయక సంఘాల సభ్యులు 391 మందికి ఇన్సూరెన్స్ చేశామన్నారు. ఏపీఎంలు, సెర్ప్, సీసీలు, బ్యాంకు సిబ్బంది, మండల సమాఖ్యలు పాల్గొన్నారు.
సమర్థవంతంగా
విధులు నిర్వర్తించాలి
ఎస్పీ రోహిత్‌రాజు
చండ్రుగొండ : సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ రోహిత్‌రాజు పోలీస్ అధికారులు, సిబ్బందికి సూచించారు. చండ్రుగొండ పోలీస్‌స్టేషన్‌ను శుక్రవారం ఆయన సందర్శించారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. క్రైం రేట్‌పై ఆరా తీసి, రికార్డులను శీలించారు. సమస్యలతో స్టేషన్‌కు వచ్చేవారికి న్యాయం చేకూర్చాలన్నారు. విధులపట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూలూరుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్‌ఐ శివరామకృష్ణ పాల్గొన్నారు.
పాఠశాలల్లో వసతులు కల్పిస్తాం
జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి
బూర్గంపాడు: ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా పరిషత్ సీఈఓ నాగలక్ష్మి తెలిపారు. బూర్గంపాడులోని తెలంగాణ గురుకుల పాఠశాల(బాలికలు)లో రూ 3 లక్షలతో నిర్మించనున్న కమ్యూనిటీ టాయిలెట్లకు శుక్రవారం ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎంపీడీఓ జమలారెడ్డి, ఎంపీఓ బాలయ్య, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పర్ణశాల రామయ్యకు వెండి కవచాల బహుకరణ
దుమ్ముగూడెం/భద్రాచలంటౌన్: పర్ణశాల శ్రీసీతారామ చంద్రస్వామివారికి ఏపీలోని నెల్లూరుకు చెందిన ఒగిలి సంతోష్‌రెడ్డి–సాహిత్య దంపతులు రూ.11 లక్షల విలువైన వెండి కవచాలను శుక్రవారం బహుకరించారు. 10.500 కేజీల వెండిపై బంగారు పూతతో తయారు చేసిన కవచాలను ఆలయ ఇన్‌చార్జ్ అనిల్‌కుమార్‌కు అందించారు. ఈ సందర్భంగా సంప్రోక్షణ కార్యక్రమాలను నిర్వహించి ప్రత్యేక పూజలను చేశారు. తొలుత భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు.
ఘనంగా గిరి ప్రదక్షిణ
భద్రాచలంటౌన్: శ్రీసీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానంలో స్వామివారికి శుక్రవారం సువర్ణ తులసీ అర్చన నిర్వహించారు. శ్రీరామచంద్రుని జన్మనక్షత్రం (పునర్వసు)ని పురస్కరించుకుని భక్తరామదాసు ట్రస్ట్ కొత్తగూడెం నిర్వాహకుడు కంచర్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భద్రగిరి ప్రదక్షిణా ర్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ అధికారులు శ్రవణ్ కుమార్, శ్రీనివాస రెడ్డి, సాయిబాబు, వేదపండితులు గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు, నేత్రగంటి కృష్ణమోహన్, టి.రామదాసు, ముక్తీశ్వర్, విజయవాడ భజనమండలి సభ్యులు పాల్గొన్నారు.

బీమాతో ఎస్‌హెచ్‌జీ సభ్యులకు ప్రయోజనం

బీమాతో ఎస్‌హెచ్‌జీ సభ్యులకు ప్రయోజనం