
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారికి శనివారం సువర్ణ తులసీ అర్చన నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశా రు. అనంతరం స్వామివారిని బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచ నం జరిపించారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టా న్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ అందించాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ అందించేందుకు ఉపాధ్యాయులు శక్తివంచన లేకుండా కృషి చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. మైనార్టీ సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో అడ్మిషన్ల కోసం రూపొందించిన బ్రోచర్‌ను శనివారం ఆయన కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పిల్లలకు నాణ్యమైన బోధన అందించాలన్నారు. స్కూళ్లలో సమస్యలుంటే తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి చర్యలు చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విద్యాచందన, సీపీఓ సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.

రామయ్యకు సువర్ణ తులసీ అర్చన