
ముదివేడు రేషన్‌షాపు సీజ్
కురబలకోట : కురబలకోట మండలంలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు నిర్వహిస్తున్న రేషన్ (చౌకదుకాణ) షాపు డీలర్లను తొలగించడానికి అధికార నాయకులు చాప కింద నీరులా పావులు కదుపుతున్నారు. ఇదివరలో మద్దిరెడ్డిగారిపల్లె డీలర్ రాజీనామా చేశారు. ఆ తర్వాత మొలకవారిపల్లె చౌకదుకాణంపై కన్నేశారు. అక్కడి డీలర్‌ను తొలగించే ప్రయత్నంలో భాగంగా కొత్తగా డీలర్‌షిప్‌కు నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. కోర్టు ఆదేశాలతో మొలకవారిపల్లె చౌకదుకాణం యధావిధిగా కొనసాగుతోంది. తాజాగా సోమవారం ముదివేడులోని షేక్ షమీనాకు చెందిన షాప్ నెంబరు 1006020 చౌకదుకాణ డీలర్‌షిప్ తొలగించడానికి స్కెచ్ వేశారు. ఈమె వైఎస్సార్‌సీపీ సానుభూతి పరురాలన్న ముద్రవేశారు. ఓ అధికార పార్టీ నాయకుడు తెరవెనుక ఉండి స్థానిక సీఎస్‌డీటీ చాణుక్యను పంపి స్టాక్‌లో వ్యత్యాసం ఉందన్న సాకుతో షాప్‌ను సీజ్ చేయించారు. సరుకుల పంపిణీ బాధ్యతను అదే ఊరిలోని మరో షాప్‌కు కేటాయించారు. ఈ చర్యను రేషన్‌షాపు డీలర్ సమీన తీవ్రంగా ప్రతిఘటించారు. ఏతప్పు చేశానని ఈ చర్యకు దిగారని సీఎస్‌డీటీని నిలదీశారు. అప్పటికే డీలర్‌కు మద్దతుగా స్థానికంగా ఉన్న మైనారిటీలు, స్థానికులు షాపు వద్దకు చేరుకోవడంతో కొంత సేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అదే సమయానికి మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ వేపలపల్లె మధుసూధన్ రెడ్డి కూడా అక్కడికి చేరుకుని సీఎస్‌డీటీ చర్యను తప్పుపట్టారు షాప్‌ను సీజ్ చేసి నివేదికను ఉన్నతాధికారులకు పంపుతున్నట్లు సీఎస్‌డీటీ తెలిపారు.
కక్షసాధింపు చర్యలంటూ స్థానికుల ఆగ్రహం