
వైభవం..ధ్వజారోహణం
నందలూరు: నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం ఉదయం ధ్వజారోహణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అర్చకులు సునీల్‌కుమార్, పాంచరాత్ర ఆగమ పండితులు రఘునందన్, పవన్‌కుమార్, మనోజ్‌కుమార్, సాయిస్వామి ఆధ్వర్యంలో ధ్వజ స్తంభంపై గరుడ చిహ్నంతో ఉండే పతాకాన్ని ఎగురవేసి ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. రాత్రి సౌమ్యనాధుడు శ్రీదేవి భూదేవితో కలిసి యాలివాహనంలో పురవీధుల్లో ఊరేగుతూ భక్తజన కోటికి దర్శనమిచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ ప్రశాంతి, సూపరింటెండెంట్ హనుమంతప్ప, ఆలయ ఇన్‌స్పెక్టర్ దిలీప్‌కుమార్, విజిలెన్స్ అధికారి శేషాచలం, ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు.
● బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం పల్లకీసేవ, గ్రామోత్సవం, తిరుమంజనం, రాత్రి హంసవాహనంపై స్వామివారి గ్రామోత్సవం ఉంటుందని ఆలయ ఇన్‌స్పెక్టర్ దిలీప్‌కుమార్ తెలిపారు.

వైభవం..ధ్వజారోహణం