
10న మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్
రాయచోటి: జిల్లాలో మెగా పేరెంట్స్–టీచర్స్ మీట్‌ను ఈ నెల 10న నిర్వహిస్తున్నామని, తల్లి పేరుతో ప్రతి విద్యార్థి మొక్క నాటడం ద్వారా తల్లిదండ్రులు, పర్యావరణం పట్ల బాధ్యత పెంపొందుతాయని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. పిల్లల తల్లిదండ్రులను పాఠశాలలతో సమన్వయం చేసి విద్యార్థులను అన్ని రకాలుగా తీర్చిదిద్దడం కార్యక్రమ ముఖ్య ఉద్దేశం అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థుల ప్రోగ్రెస్ రిపోర్టుల గురించి తల్లిదండ్రులతో చర్చించనున్నట్లు చెప్పారు. సమావేశంలో మదనపల్లె సబ్ కలెక్టర్ మేఘస్వరూప్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి రవి, పాఠశాల విద్యాశాఖ ప్రతినిధి జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్