
విద్యార్థులపై మందుబాబు దాడి
చిన్నమండెం : విద్యార్థులపై తాగుబోతు దాడి చేసిన సంఘటన గురువారం మండలంలో చోటు చేసుకుంది. మండల పరిధిలోని బోనమల ప్రభుత్వ పాఠశాలలో పలువురు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన బాబు(పుష్ప) మద్యం తాగి.. ఆ విద్యార్థులపై మధ్యాహ్నం ఉపాధ్యాయులు లేని సమయం చూసుకొని దాడి చేశాడు. దీంతో గాయపడ్డ పలువురు విద్యార్థులను వెంటనే 108 వాహనంలో రాయచోటి ఆస్పత్రికి తరలించారు. తరగతి గదిలో ఉపాధ్యాయులు లేనిది చూసి తమను తాగుబోతు చేతులు మడమ తిప్పాడని పలువురు పిల్లలు ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యార్థులపై మందుబాబు దాడి