
ఆసుపత్రిలోని ఏఆర్టీ కేంద్రం తనిఖీ
మదనపల్లె రూరల్ : మదనపల్లెలోని జిల్లా ఆసుపత్రిలో ఉన్న ఏఆర్డీ, ఐసీటీసీ కేంద్రాలను జిల్లా ఎయిడ్స్ నివారణ విభాగం క్లస్టర్ ప్రోగ్రాం అధికారి వి. భాస్కర్ తనిఖీ చేశారు. శుక్రవారం ఏఆర్‌టీ,ఐసీటీసీ విభాగాల్లోని పలు రికార్డులను పరిశీలించారు. వైద్య సేవలపై సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఆర్‌టీ, ఐసీటీసీ ద్వారా రోగులకు మరిన్ని వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఇదివరకు మదనపల్లె ప్రభుత్వాసుపత్రి ఏఆర్టీ కేంద్రాన్ని చిత్తూరు జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ విభాగం వారు తనిఖీలు చేసేవారని, ఇకపై కడప జిల్లా పరిధిలోకి ప్రభుత్వం మార్చిందన్నారు. ఆసుపత్రిలో హెచ్‌ఐవీ బాధితులకు అందుతున్న వైద్యసేవలు, అందుబాటులో ఉన్న మందులు, పరీక్షల కిట్లు, ఇతర సౌకర్యాలపై ఆరా తీశారు. కొన్ని రకాల కిట్లు కొరత ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఆసుపత్రిలో రక్తనిధి కేంద్రాన్ని వేరే భవనంలోకి మార్చడంపై సూపరింటెండెంట్ డాక్టర్ కోటేశ్వరితో చర్చించారు. కార్యక్రమంలో జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ విభాగం జిల్లా అకౌంటెంట్ ఎస్. అప్రోజ్, ప్రోగ్రాం అధికారి అబ్దుల్ సాదిక్, ఐసీటీసీ సిబ్బంది జయకుమార్, పుల్లయ్యనాయుడు, దీప్తి పాల్గొన్నారు.