
ప్రజా సమస్యలను బాధ్యతగా పరిష్కరించాలి
రాయచోటి : ప్రజా సమస్యలను బాధ్యతగా పరిష్కరించాలని డీఆర్‌ఓ మధుసూదనరావు అధికారులను ఆదేశించారు. రాయచోటి కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో డీఆర్‌ఓ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా అందిన ప్రజల సమస్యలను అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరించాలని డీఆర్‌ఓ తెలిపారు. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఫిర్యాదుల పరిష్కారంపై నేరుగా పర్యవేక్షణ చేస్తోందన్నారు. ప్రతి సమస్యను, ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్‌ను ప్రభుత్వం సీరియస్‌గా పరిశీలిస్తుందన్నారు. అధికారులు ప్రాధాన్యతగా ఫిర్యాదులను నూరు శాతం పరిష్కరించాలన్నారు. అనంతరం వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఏడీ సర్వే భరత్‌కుమార్, జీఎస్‌డబ్ల్యుఎస్ శాఖ జిల్లా అధికారి లక్ష్మీపతి, ఎస్‌డీసీ రాఘవేంద్ర, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.