
గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి
రామసముద్రం : గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన సంఘటన రామసముద్రం మండలంలో శనివారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రామసముద్రం మండలం చెంబకూరు పంచాయతీ దిగువపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీనరసమ్మ(65), కృష్ణమ్మ, శ్రీనివాసులు ద్విచక్రవాహనంలో సమీప గ్రామమైన పనసమానుకుంటలో రామకోటి కార్యక్రమానికి బయలు దేరారు. చెంబకూరు–మదనపల్లి రోడ్డు మార్గంలోని బలిజపల్లి క్రాస్ వద్ద మదనపల్లి నుంచి ఎదురుగా వస్తున్న గుర్తు తెలియని వాహనం ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా గమనించిన స్థానికులు వెంటనే క్షతగ్రాత్రులను మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ లక్ష్మీనరసమ్మ మృతి చెందింది. కాగా కృష్ణమ్మ తలకు , భుజానికి తీవ్ర గాయాలు కాగా శ్రీనివాసులు కాలు విరిగింది. పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీనివాసులును మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. అక్కడి వైద్యుల సిఫారసు మేరకు వేలూరు సీఎంసీకి తీసుకెళ్లారు. కృష్ణమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో మదనపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సంఘటన స్థలాన్ని ఆదివారం మదనపల్లి రూరల్ సీఐ సత్యనారాయణ పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇద్దరికి తీవ్ర గాయాలు

గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి