
భావితరాలకు నవోదయం
మదనపల్లె సిటీ: కార్పొరేట్ పాఠశాలల ధీటుగా అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య,ఉత్తమ విలువలు,దేశభక్తి , క్రీడలు ఇలా అన్ని రంగాల్లో విద్యార్థులను నిపుణులుగా తీ ర్చిదిద్దుతూ అదర్శంగా నిలుస్తోంది ఉమ్మడి చిత్తూరు జి ల్లాలోని మదనపల్లె సమీపం వలసపల్లి, ఉమ్మడి కడప జి ల్లాలోని రాజంపేటలోని జవహర్ నవోదయ విద్యాలయా లు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వరంగా మారిన నవోద య విద్యాలయాల్లో 2026–27 విద్యా సంవత్సరంలో ప్రవే శానికి దేశవ్యాప్తంగా నోటిఫికేషన్ విడుదలైంది. ఆరో తరగతిలో ప్రవేశాలకుగాను దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
’నెట్‌లో దరఖాస్తుల ఆహ్వానం
విద్యాలయంలో ప్రవేశానికి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.నవోదయ.జీవోవీ.ఇన్ అనే వెబ్‌సైట్‌లో ఇంటర్‌నెట్‌లో దరఖాస్తులు సమర్పించాలి. పాఠశాలలో ఆరో తరగతిలో 80 సీట్లు ఉంటాయి. దరఖాస్తు సమర్పణకు జులై 29 చివరి తేదీగా ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్ 13న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు.
రిజర్వేషన్లు: విద్యాలయంలోని 80 సీట్లలో 75 శాతం (60 సీట్లు) గ్రామీణ ప్రాంత, 25 శాతం (20 సీట్లు) పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయిస్తారు. అందులో 15 శాతం ఎస్సీ, 7.5 శాతం ఎస్టీ, 3 శాతం దివ్యాంగులు, బాలికలకు 1/.3 వంతు రిజర్వేషన్ అమలు చేస్తారు. అభ్యర్థి ఫోటో, సంతకం, తల్లి/ తండ్రి/ సంరక్షకుడి సంతకంతో దరఖాస్తులు సమర్పించాలి.
’సీబీఎస్‌ఈ సిలబస్... నాణ్యమైన విద్య
ఆరో తరగతి ప్రవేశం పొందితే ఇంటర్మీడియట్ వరకు ఉచితంగా బోధిస్తారు. విద్యార్థుల్లో జాతీయ సమైక్యత భావాన్ని పెంపొందించేలా వలస (మైగ్రేషన్ ) విధానాన్ని ప్రవేశపెట్టింది. ఏటా తొమ్మిదో తరగతి చిన్నారులను ఇతర రాష్ట్రాలకు పంపిస్తారు. ఇతర రాష్ట్రాల నుంచి వారిని ఇక్కడికి తీసుకువస్తారు. ఆరో తరగతి నుంచి కంప్యూర్ విద్య బోధిస్తారు. ఆధునాతన వసతులతో కూడిన గ్రంథాలయం, ఎస్‌సీసీ, క్రీడలకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. ప్రతి ఏటా శతశాతం ఉత్తీర్ణ సాధిస్తూ ప్రతిభ చాటుతున్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
అర్హతలు ఇలా...
3,4,5 తరగతులు ప్రభుత్వం లేదా గుర్తింపు పొందిన పాఠశాలలో చదవాలి. అయిదో తరగతి తప్పనిసరిగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చదివి ఉండాలి. అధార్‌కార్డు తప్పనిసరి. లేదా తహసీల్దార్ కార్యాలయం నుంచి నివాస ధ్రువీకరణ పత్రం అవసరం. అభ్యర్థి తల్లిదండ్రలు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందినవారై ఉండాలి. అభ్యర్థుఽలు 1.5.2014 నుంచి 31.07.2016 మధ్య జన్మించిన వారు అర్హులు.
పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ:
విద్యాలయంలో ప్రవేశాల పరీక్ష,ఎంపిక పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది. విద్యార్థుల మార్కుల ఆధారంగానే ప్రవేశాలు ఉంటాయి. దళారులను నమ్మవద్దు. దరఖాస్తు, ప్రవేశపరీక్ష, ఎంపిక ప్రక్రియ పూర్తిగా ఇంటర్‌నెట్‌లోనే ఉంటుంది. ప్రవేశపరీక్షపై భయం వీడి విద్యార్థులు కష్టపడి చదివితే సులువుగా ప్రవేశం పొందవచ్చు. –గీత, ప్రిన్సిపాల్,
జవహర్ నవోదయ విద్యాలయ, మదనపల్లె

భావితరాలకు నవోదయం

భావితరాలకు నవోదయం

భావితరాలకు నవోదయం