
యోగాను అభ్యసించి మానసికంగా దృఢంగా ఉండాలి
రాయచోటి: యోగాను ప్రతిరోజు అభ్యసించి శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ అభిప్రాయపడ్డారు. జిల్లాను యోగాంధ్ర కార్యక్రమంలోని వివిధ అంశాల్లో మొదటి స్థానంలో నిలిపిన జిల్లా ప్రజలకు కలెక్టర్ అభినందనలు తెలిపారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం రాయచోటిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్‌లో కలెక్టర్ నాయకత్వంలో 5 వేల మందితో యోగా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. రాయచోటిలో 5 వేల మందితో, 5050 ప్రాంతాల్లో 8 లక్షల మందితో యోగా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్‌రాజేంద్రన్ మాట్లాడుతూ జిల్లాలో మే 21 నుంచి జూన్ 21 వరకు యోగాంధ్ర కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడంలో కృషి చేసిన జిల్లా అధికారులకు, ఎంపీడీఓలకు ముఖ్యంగా రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, పీడీ డీఆర్‌డీఏ సత్యనారాయణ, రాయచోటి మున్సిపల్ కమిషనర్ వాసు, జిల్లా పర్యాటక శాఖ అధికారి నాగభూషణంలను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో మదనపల్లె సబ్ కలెక్టర్ మేఘస్వరూప్, డీఆర్‌ఓ మధుసూదన్‌రావు, రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, రాయచోటి మున్సిపల్ కమిషనర్ వాసు, రాయచోటి తహసీల్దార్ నరసింహకుమార్, జిల్లా పర్యాటక శాఖ అధికారి నాగభూషణం, డీఆర్‌డీఏ పీడీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
అందరూ యోగా సాధన చేయాలి
పరిపూర్ణ జీవనశైలికి యోగా ఒక బాటగా నిలుస్తుందని జిల్లా అదనపు ఎస్పీ ఎం వెంకటాద్రి అన్నారు. జిల్లా ఎస్పీ వి విద్యాసాగర నాయుడు ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో రాయచోటి పోలీసులు పరేడ్ మైదానంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. యోగా గురువులు పోలీసు సిబ్బందికి యోగాలో ఉన్న మెలకువలు నేర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిపూర్ణ ఆరోగ్యాన్ని సంపాదించుకోవడానికి నిరంతర యోగా సాధన చేయాలన్నారు.కార్యక్రమంలో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్, ఎం పెద్దయ్య, యోగా గురువులు నారాయణ, సహదేవరెడ్డి, శ్రీనివాసులు, రవిచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్

యోగాను అభ్యసించి మానసికంగా దృఢంగా ఉండాలి