
● రెండు పార్లమెంటరీస్టేషన్లలో ఆగని రైలు
3700 కిలో మీటర్ల మేర 48 గంటల పాటు నడిచే హంససఫర్ జిల్లా మీదుగా కశ్మీరుకు వెళ్లే ఈరైలుకు హాల్టింగ్ కల్పించాలని గతంలోనే కడప, రాజంపేట ఎంపీలు వైఎస్ అవినాష్‌రెడ్డి, పీవీ మిథున్‌రెడ్డి కేంద్ర రైల్వేమంత్రిత్వశాఖను కోరారు. పార్లమెంటరీ స్టేషన్లు అయిన కడప, రాజంపేటలో స్టాపింగ్ ఇవ్వాలని దక్షిణ మధ్యరైల్వే జనరల్ మేనేజరు నుంచి రైల్వే మంత్రిత్వశాఖను జిల్లా ప్రయాణికులు కోరుతున్నారు. రాజంపేట, కడప రైల్వేస్టేషన్లలో హంసఫర్ రైలుకు స్టాపింగ్‌కు రైల్వేమంత్రిత్వశాఖ, బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇస్తే కొంతవరకు రైలుకు ఎర్నింగ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని రైల్వే వర్గాలే ధృవీకరిస్తున్నాయి.