
బైక్‌పై నుంచి జారిపడి వృద్ధురాలి మృతి
మదనపల్లె రూరల్ : బైక్‌పై నుంచి జారిపడి తీవ్రంగా గాయపడిన వృద్ధురాలు మృతి చెందిన సంఘటన శుక్రవారం చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలంలో జరిగింది. జంగాలపల్లెకు చెందిన రాజమ్మ(80)కు అనారోగ్యంగా ఉండడంతో డాక్టర్ వద్దకు వెళ్లేందుకు బంధువు శ్రీరాములు ద్విచక్ర వాహనంలో చౌడేపల్లెకు బయలుదేరింది. చికిత్స అనంతరం తిరిగి స్వగ్రామానికి వస్తుండగా, మార్గమధ్యంలో కుక్క అడ్డు రావడంతో వాహనం అదుపుతప్పింది. బైక్‌పై కూర్చొన్న రాజమ్మ ప్రమాదవశాత్తూ జారి కిందపడింది. తలకు తీవ్రగాయాలు కాగా 108 అంబులెన్స్ వాహనంలో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ మృతిచెందింది. దీంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించి, చౌడేపల్లె పోలీసులకు అవుట్ పోస్ట్ సిబ్బంది సమాచారం అందించారు.