ఆ ఘనత సీఎం వైఎస్‌ జగన్‌దే..

Speaker Tammineni Sitaram Praises CM YS Jagan - Sakshi

ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం

సాక్షి, శ్రీకాకుళం: దేశ చరిత్రలోనే నెల తిరగక ముందే తుపాను నష్ట పరిహారం రైతులకు అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మూడవ విడత వైఎస్సార్‌ రైతు భరోసా కింద  51.59 లక్షల రైతుల ఖాతాల్లోకి 1,120 కోట్లు  జమ చేశారని పేర్కొన్నారు. రైతు సంక్షేమం పట్ల సీఎం వైఎస్‌ జగన్ ఎంత నిబద్దత కలిగి ఉన్నారో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చన్నారు. ఇచ్చిన మాటకు సీఎం జగన్‌ కట్టుబడి పనిచేస్తున్నారని స్పీకర్‌ పేర్కొన్నారు. (చదవండి: రేపు విజయనగరం జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన)

అప్పుల బాధలు తాళ్ల లేక గతంలో రైతుల ఆత్మహత్యల ఘటనలను సీఎం జగన్ గ్రహించారు. మళ్ళీ అలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు తక్షణమే ఆర్థిక సాయం అందిస్తున్నారు. ప్రజలను పాలించే వారికి మానవతావాదం ఉండాలని, వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా కంటే ఒక మానవతావాదిగా తనకు ఎంతో గౌరవమని స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు.(చదవండి: ‘అది చిడతల నాయుడికే చెల్లింది’)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top