2019 కంటే మరింత రీసౌండ్ విక్టరీ ఖాయం: సజ్జల

Sajjala Ramakrishna Reddy Serious Comments On Yellow Media - Sakshi

సాక్షి, తాడేపల్లి: ఎల్లో మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పాలన చూసి ప్రతిపక్షాలు కడుపుమంటతో రగిలిపోతున్నాయి. ఎల్లో మీడియాతో దుష్ర్పచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. 

కాగా, సజ్జల మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కోట్లాది ప్రజల ఆకాంక్షలను నిజం చేస్తూ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు ఈరోజు. ఎన్నికల రిజల్ట్స్‌ వచ్చి నేటికి నాలుగేళ్లు అయింది. ఇచ్చిన హామీలను 98.5% అమలు చేసి చూపించాం. అసలైన రాజకీయ పార్టీకి, రాజకీయ నాయకులకు  ఉండాల్సిన లక్షణాలు సీఎం జగన్ చేసి చూపించారు. అవినీతికి వ్యతిరేకంగా, పారదర్శకంగా అభివృద్ధి, సంక్షేమం అమలు చేస్తున్నాం. బందరు పోర్టు‌ శంకుస్థాపన మరో మైలురాయి. వచ్చే ఏడాది రామాయపట్నం పోర్టు ప్రారంభం అవుతుంది. నిజమైన అభివృద్ధి ఎలా ఉంటుందో ప్రజలంతా గమనిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏపీ పాలనను మెచ్చుకుంటున్నాయి.

16 మెడికల్ కాలేజీల నిర్మాణం వేగంగా జరుగుతోంది. పాలనా వికేంద్రీకరణ జరిగింది. 2019 కంటే మరింత రీసౌండ్ విక్టరీ ఈసారి వస్తుంది. కేంద్రం నిధులు ఇస్తే కూడా ఎల్లో మీడియా కడుపుమంటతో అల్లాడుతోంది. మనకు రావాల్సిన నిధులు మనం సాధించగలిగాం. ఆనాడు చంద్రబాబు చేయలేని పనిని సీఎం జగన్ చేసి చూపించారు. బీజేపీతో పార్టనర్‌గా ఉండి కూడా చంద్రబాబు ఏమీ చేయలేదు. తన వ్యక్తిగత పనులకు వాడుకున్నారే తప్ప రాష్ట్రానికి ఉపయోగపడే పని చేయలేదు. ఎప్పుడు చెడు జరుగుతుందా అని చంద్రబాబు అండ్ కో ఎదురు చూస్తూ ఉంటారు. 

అవినాష్‌ వ్యవహారంలోనూ తప్పుడు రాతలు..
ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి వ్యవహారంలోనూ ఎల్లో మీడియా రోతరాతలు రాస్తున్నారు. అవినాష్‌ రెడ్డి వ్యవహారం కోర్టులో ఉంది. అనవసర కథనాలు రాస్తూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. తన తల్లి అనారోగ్యంతో ఉండటంతో అవినాష్‌ విచారణకు హాజరుకాలేదు. ఆ విషయాన్ని సీబీఐకి కూడా తెలిపారు. ఇప్పటికే అవినాష్‌ రెడ్డి ఆరుసార్లు విచారణకు హాజరయ్యారు. కేంద్ర బలగాలు వస్తున్నాయని అసత్య కథనాలు రాశారు. మళ్ళీ రాకుండా అడ్డుకున్నారంటూ వారే రాస్తారు.

రామోజీరావు కేసులో ఏ కోర్టుకైనా వెళ్లొచ్చా? అవినాష్ వెళ్తే ఎలా తప్పు అవుతుంది?. హైదరాబాదు వెళ్తే ఎందుకు వెళ్లారని అడుగుతారు?. బెంగుళూరు వెళ్తే ఎందుకు వెళ్ళారని అడుగుతారు?. వారిష్టం వచ్చినట్లు వార్తలు రాస్తున్నారు. పబ్లిక్ ఇష్యూస్‌ను పక్కదారి పట్టించేలా ఆ మీడియా వ్యవహరిస్తోంది. అవినాష్ మీద కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తే అలాగే జరుగుతుంది. కానీ ఎల్లోమీడియా అనుకున్నట్లు జరగలేదని కడుపుమంటతో బాధ పడుతున్నారు అని కామెంట్స్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: ఎమ్మెల్యే గిరిధర్‌ను పరామర్శించిన సీఎం జగన్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top