
శ్రీసత్యసాయి జిల్లా గూనిపల్లిలో వృద్ధురాలితో మాట్లాడుతున్న ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్
సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం మంగళవారం ఉత్సాహంగా కొనసాగింది. గ్రామ గ్రామానా ప్రజలు ఎదురేగి తమ నాయకులకు స్వాగతం పలుకుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు తమ ఇంటికి వచ్చి సమస్యల గురించి అడుగుతుంటే ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
చెప్పిన సమస్యల్ని పరిష్కరించేందుకు అక్కడికక్కడే చర్యలు తీసుకోవడం కూడా వారికి మరింత సంతృప్తి ఇస్తోంది. వైఎస్సార్‌సీపీ పాలనలో మూడేళ్లుగా సంక్షేమ పథకాల ద్వారా తాము పొందిన లబ్ధిని వివరిస్తున్నారు. అర్హతే ప్రామాణికంగా తమకు కలిగిన మేలు గురించి చెప్పి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 95 శాతం హామీలను అమలు చేసిందని, రానున్న రెండేళ్లలో మరింత లబ్ధి చేకూరుస్తుందని నాయకులు వివరించారు.