మాటలతోనే సరి.. రైతు ఆశలు ఆవిరి
పంట చేతికి వచ్చినా ధరల్లేక అరటి రైతులు దిక్కులు చూస్తున్నారు. కొనేవారు లేక తోటలను అలాగే వదిలేస్తున్న దుస్థితి నెలకొంది. తోటలోనే కాయలు మాగిపోతున్నా పట్టించుకునే వారు లేరు. రూ. లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి సాగు చేసిన పంట కళ్లెదుటే కుళ్లిపోతుండడం చూసి రైతులు నలిగిపోతున్నారు. ‘గిట్టుబాటు ధర కల్పిస్తాం.. ఆదుకుంటాం..’ అంటూ ఆశలు రేకెత్తిస్తున్న పాలకులు, అధికారులు చివరికి ఉత్తచేతులు చూపుతూ నిరాశే మిగులుస్తున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం


