
తీవ్రంగా తాగునీటి సమస్య
● మంత్రి కేశవ్‌తో వాపోయిన మహిళలు
విడపనకల్లు: తమ గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డొనేకల్లు గ్రామ మహిళలు మంత్రి పయ్యావుల కేశవ్‌కు విన్నవించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని డొనేకల్లు, గడేకల్లు గ్రామాల్లో శనివారం మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా డొనేకల్లులో మహిళలు తాగునీటి సమస్యపై మంత్రి ఎదుట ఏకరువు పెట్టారు. అనంతరం కేశవ్ విలేకరులతో మాట్లాడుతూ ఏడాది కూటమి పాలనపై రాష్ట్ర ప్రజల్లో అపారమైన నమ్మకం ఏర్పడిందని తెలిపారు. వలంటీర్ల ద్వారా ప్రజలకు జరిగిందేమీ లేదన్నారు.
తల్లికి వందనం డబ్బులు ఎప్పుడొస్తాయి సారూ..?
● ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌రెడ్డిని ప్రశ్నించిన ప్రజలు
యాడికి: ‘తల్లికి వందనం పథకం కింద మా పిల్లలకు డబ్బులు రాలేదు. సచివాలయ ఉద్యోగులను అడిగితే త్వరలో ఖాతాలో జమ అవుతుందంటున్నారు. ఇంతకూ డబ్బులు ఎప్పుడొస్తాయి’అని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌రెడ్డిని ప్రశ్నించారు. శనివారం మండల కేంద్రంలోని రాఘవేంద్ర కాలనీలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిర్వహించారు. ఇళ్ల వద్దకు వెళ్లి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా అని ప్రజలను అడగగా.. ‘రాలేదు’అని పలువురు ఎమ్మెల్యేకు తెలియజేశారు.