
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కమిటీలో పలువురికి చోటు
అనంతపురం కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర కమిటీలో జిల్లాకు చెందిన పలువురు నాయకులకు చోటు లభించింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా వెన్నం శివరామిరెడ్డి (ఎన్‌ఆర్‌ఐ), చింతకుంట వెంకటేశులు (అనంతపురం అర్బన్), మెట్టు విశ్వనాథ్‌రెడ్డి, కళేకుర్తి ఉషారాణి (రాయదుర్గం), జింకల రామాంజినేయులు, చుక్కలూరు దిలీప్‌రెడ్డి(గుంతకల్లు), బళ్లారి మహమ్మద్ జిలాన్, వెన్నపూస వెంకటరామిరెడ్డి (తాడిపత్రి), కురుబ నాగిరెడ్డి, గంగన గోపాల్‌రెడ్డి, ముదిగుబ్బ వీరాంజినేయులు, అంకె లక్ష్మణ్ణ(రాప్తాడు) నియమితులయ్యారు.
ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ‘కొర్రపాడు’
అనంతపురం కార్పొరేషన్: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కమిటీలో జిల్లాకు చెందిన ఇద్దరికి అవకాశం కల్పించారు. ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అనంతపురానికి చెందిన కొర్రపాడు హుస్సేన్‌పీరా, రాష్ట్ర కార్యదర్శిగా బి.రాజాశేఖర్‌రెడ్డి (రాజారెడ్డి)ని నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్వర్వులు అందాయి.
‘విద్యా శక్తి’ని టీచర్లపై రుద్దడం సరికాదు
అనంతపురం ఎడ్యుకేషన్: బడి వేళల తర్వాత ‘విద్యాశక్తి’ అనే నూతన కార్యక్రమాన్ని ప్రభుత్వం ఉపాధ్యాయులపై రుద్దడం సరికాదని స్కూల్ అసిస్టెంట్ అసోసియేషన్ నాయకులు వాపోయారు. శనివారం సాయంత్రం నగరంలోని ఉపాధ్యాయ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి బి. రాజశేఖర్ మాట్లాడారు. ఏటా 10వ తరగతి విద్యార్థులకు ‘వంద రోజుల ప్రణాళిక’ కార్యక్రమం జనవరి నెలలో ప్రారంభమవుతుందన్నారు. కానీ జూలై 1 నుంచే పారంభించడం ఉపాధ్యాయులపై ఒత్తిడి తీసుకురావడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా అశాసీ్త్రయమైన విధానమని అన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడతాయన్నారు. రవాణా సౌకర్యం లేని గ్రామాలు చాలా ఉన్నాయన్నారు. కాలి బాటన వచ్చే గ్రామీణ ప్రాంత విద్యార్థులు అధికంగా ఉన్నారని, వారు ఇంటికి చేరుకోవడానికి చీకటి అవుతుందన్నారు. ముఖ్యంగా బాలికలకు తీవ్ర అసౌకర్యంగా ఉంటుందన్నారు. ప్రభుత్వం నిర్ణయం ఏమాత్రమూ ఆమోదయోగ్యంగా లేదన్నారు. మరోవైపు రెగ్యులర్ బోధనకు ఆటంకం ఏర్పడుతుందని పేర్కొన్నారు. అనాలోచిత నిర్ణయం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో స్కూల్ అసిస్టెంట్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివశంకరయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, నాయకులు నాగన్న, ఓబులేసు, శ్రీరాములు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కమిటీలో పలువురికి చోటు

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కమిటీలో పలువురికి చోటు