
పన్ను ఎగవేతను కట్టడి చేయాలి
అనంతపురం అర్బన్: పన్ను ఎగవేతదారులను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని మంత్రుల కమిటీకి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సూచించారు. దేశవ్యాప్తంగా జీఎస్‌టీ పన్నుల వసూళ్ల సరళిని పరిశీలించేందుకు ఏర్పాటైన మంత్రుల కమిటీ శుక్రవారం న్యూఢిల్లీలో సమావేశమైంది. కమిటీ కన్వీనర్, గోవా సీఎం డాక్టర్ ప్రమోద్ పి.సావంత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సభ్యునిగా ఉన్న మంత్రి కేశవ్ కలెక్టరేట్ నుంచి వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీఎస్‌టీ డేటా యాక్సెస్ అన్ని రాష్ట్రాల ఇంట్రాస్టేట్ అండ్ ఇంటర్ స్టేట్ స్థాయిలో సమాచారం లైవ్‌ను అందుబాటులో ఉంచాలన్నారు. తద్వారా పన్ను ఎగవేతదారులను కట్టడి చేయడానికి వీలువుతుందన్నారు.
ఆర్థిక శాఖ మంత్రి కేశవ్