
కనులపండువగా గూగూడు ఉత్సవాలు
నార్పల: మండల పరిధిలోని గూగూడు గ్రామంలో కుళ్లాయి స్వామి వార్షిక ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా గురువారం 5 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. హిందూ ముస్లింలు అన్నదమ్ముల్లా కలసిమెలసి కుళ్లాయిస్వామి, ఆంజనేయ స్వామి పూజల్లో పాల్గొన్నారు. స్వామి వారిని ఆలయ ప్రధాన అర్చకులు హుసేనప్ప ప్రత్యేకంగా అలంక రించి చక్కెర చదివింపులు చేశారు. భక్తుల రద్దీ పెరగడంలో పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఏడవ సరిగెత్తు నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు.