
గుంతకల్లు క్రీడాకారులకు అంతర్జాతీయ చెస్ రేటింగ్
గుంతకల్లు: ప్రపంచ చదరంగ సమాఖ్య (ఎఫ్‌ఐడీఈ), అఖిల భారత చదరంగ సమాఖ్య (ఏఐసీఎఫ్) సంయుక్తంగా మంగళవారం విడుదల చేసిన చదరంగ క్రీడాకారుల రేటింగ్ జాబితాలో గుంతకల్లు చెందిన ఐదుగురు క్రీడాకారులకు అంతర్జాతీయ రేటింగ్ దక్కింది. ఈ మేరకు కోచ్‌లు అనిల్‌కుమార్, రామారావు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. బాలల విభాగంలో బాలాజీ (1,472), పునీత్‌రెడ్డి (14,712), కార్తీక్ (1,493), రాఘవ (1,478) అంతర్జాతీయ రేటింగ్ దక్కించుకున్నారన్నారు. బాలికల విభాగంలో 1,401 రేటింగ్‌తో గుంతకల్లు చెస్ క్రీడా చరిత్రలో మొట్టమొదటి రేటెడ్ ప్లేయర్‌గా జువైరా రికార్డు నమోదు చేసిందని తెలిపారు.
రైలులో ప్రయాణికుడి మృతి
గుంతకల్లు: ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ మేరకు జీఆర్‌పీ ఎస్‌ఐ మహేంద్ర మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ద్వివాంగుల బోగీలో ప్రయాణిస్తున్న అతని వద్ద కనీసం టికెట్ కూడా లేదు. సరైన సంరక్షణ లేకపోవడం, దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతుండడమే మృతికి కారణంగా ప్రాథమికంగా నిర్ధారించారు. సుమారు 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉంటుంది. ఎరుపు రంగులో ఉండి.. కాఫీ కలర్ టీ షర్టు ధరించాడు. ఆచూకీ తెలిసిన వారు 98661 44616కు సమాచారం అందించాలని రైల్వే పోలీసులు కోరారు.
కుక్కల దాడిలో 20 గొర్రెల మృతి
బుక్కరాయసముద్రం: మండలంలోని చెదుల్ల గ్రామంలో కుక్కల దాడిలో 20 గొర్రెలు మృతి చెందాయి. స్థానికులు తెలిపిన మేరకు... చెదుల్ల గ్రామానికి చెందిన రాగే ఎల్లప్ప గొర్రెల పోషణతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గ్రామ శివారులోని దొడ్డిలో మంగళవారం మధ్యాహ్నం జీవాలను వదిలి ఇంటికెళ్లి భోజనం చేసుకుని వచ్చేలోపు వీధి కుక్కల గుంపు మందపై దాడి చేశాయి. ఘటనలో 20 గొర్రెలు మృతి చెందాయి.
అతిథి అధ్యాపకులకు నేడు ఇంటర్వ్యూలు
అనంతపురం ఎడ్యుకేషన్: స్థానిక ప్రభుత్వ వృత్తి విద్య జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న లైవ్ స్టాక్ మేనేజ్‌మెంట్ – డెయిరీ కోర్సు బోధనకు అర్హులైన అతిథి అధ్యాపకులకు బుధవారం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ గురుప్రసాద్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10.30 గంటలకు ఇంటర్వ్యూలు అదే కళాశాలలో జరుగుతాయి. బీవీఎస్సీలో డిగ్రీ (వెటర్నరీ సైన్స్) లేదా డెయిరీ సైన్స్‌లో డిగ్రీ ఉన్న వారు అర్హులు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు జిరాక్స్ కాపీలను వెంట తీసుకెళ్లాలి.
గాడిద పిల్లపై చిరుత దాడి
వజ్రకరూరు: మండలంలోని కడమలకుంట గ్రామ పరిసరాల్లో చిరుత దాడిలో ఓ గాడిద పిల్ల మృతి చెందింది. యజమాని చాకలి వెంకటేష్ సమాచారం ఇవ్వడంతో మంగళవారం ఉదయం ఫారెస్ట్ బీట్ ధికారి సతీష్‌కుమార్, వెటర్నరీ అసిస్టెంట్ వెంకటేష్, ప్లాట్ వాచర్ మల్లికార్జున తదితరులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. సోమవారం రాత్రి చిరుత దాడి చేసినట్లుగా నిర్ధారించారు. చిరుత సంచారాన్ని అరికట్టాలని ఈ సందర్భంగా పలువురు కోరారు.
ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ
రేపు ప్రైవేట్ విద్యాసంస్థల బంద్
అనంతపురం ఎడ్యుకేషన్: కూటమి ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను నిరసిస్తూ ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు ఈ నెల 3న విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయి. రాష్ట్ర కమిటీ పిలపు మేరకు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను బంద్ చేసి శాంతియుతంగా నిరసన తెలిపేలా నిర్ణయించినట్లు అపుస్మా రాష్ట్ర కోఆర్డినేటర్ కుసుమ పుల్లారెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఆర్టీఈ 12(1)సి ద్వారా ఉచిత అడ్మిషన్లకు బలవంతం చేస్తున్నారంటూ వాపోయారు. అకారణంగా షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నారని, గుర్తింపు రద్దు చేస్తామంటూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధ్రువీకరణ లేని ఫిర్యాదుల ఆధారంగా అధికారులు ఏకపక్షంగా తనిఖీలు చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమానులు సహకరించి 3న స్వచ్చందంగా విద్యా సంస్థలు బంద్ పాటించాలని పుల్లారెడ్డి పిలుపునిచ్చారు.

గుంతకల్లు క్రీడాకారులకు అంతర్జాతీయ చెస్ రేటింగ్

గుంతకల్లు క్రీడాకారులకు అంతర్జాతీయ చెస్ రేటింగ్

గుంతకల్లు క్రీడాకారులకు అంతర్జాతీయ చెస్ రేటింగ్

గుంతకల్లు క్రీడాకారులకు అంతర్జాతీయ చెస్ రేటింగ్

గుంతకల్లు క్రీడాకారులకు అంతర్జాతీయ చెస్ రేటింగ్

గుంతకల్లు క్రీడాకారులకు అంతర్జాతీయ చెస్ రేటింగ్

గుంతకల్లు క్రీడాకారులకు అంతర్జాతీయ చెస్ రేటింగ్