
అధినేతతో భేటీ
శింగనమల: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మంగళవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఆ పార్టీ ఎన్‌ఆర్‌ఐ విభాగం కో–ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయన వెంట పుట్లూరు ఎంపీపీ భూమిరెడ్డి రాఘవరెడ్డి, మండల మాజీ కన్వీనర్లు రఘనాథరెడ్డి, నరేంద్రనాథ్‌రెడ్డి ఉన్నారు.
భూగర్భ జలశాఖ ఇన్‌చార్జ్ డీడీగా మల్లికార్జునరావు
అనంతపురం అగ్రికల్చర్: భూగర్భ జలశాఖ ఇన్‌చార్జ్ డిప్యూటీ డైరెక్టర్ (డీడీ)గా ఎం.మల్లికార్జునరావు బాధ్యతలు తీసుకున్నారు. ఇక్కడ పనిచేస్తున్న డీడీ కె.తిప్పేస్వామి విజయవాడలో ఉన్న ప్రఽధాన కార్యాలయానికి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నంద్యాలలో పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ మల్లికార్జునరావుకు ఇన్‌చార్జ్ డీడీగా బదిలీ చేశారు.
హెచ్చెల్సీ ఇన్‌చార్జ్ ఎస్‌ఈగా విశ్వనాథరెడ్డి
అనంతపురం సెంట్రల్: హెచ్చెల్సీ ఇన్‌చార్జ్ ఎస్‌ఈగా విశ్వనాథరెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇది వరకే ఇన్‌చార్జ్ ఎస్‌ఈగా పనిచేస్తున్న పురంధరరెడ్డి ఉద్యోగ విరమణ పొందారు. దీంతో చిన్న నీటిపారుదలశాఖ ఎస్‌ఈగా ఉన్న విశ్వనాథరెడ్డికి ఇన్‌చార్జ్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ–స్టాంపుల కుంభకోణంపై అధికారులకు సమాచారమిచ్చా
● టీడీపీ నేత ఉన్నం మారుతి చౌదరి
అనంతపురం టవర్‌క్లాక్: కళ్యాణదుర్గంలో టీడీపీ కార్యకర్త ఎర్రప్ప అలియాస్ బాబు ‘మీసేవ’ కేంద్రంగా సాగిన నకిలీ ఈ–స్టాంపుల కుంభకోణంపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ అధికారులకు తానే సమాచారం ఇచ్చానని మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి కుమారుడు, టీడీపీ నేత మారుతి చౌదరి తెలిపారు. మంగళవారం ఆయన అనంతపురం ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. ఎర్రప్ప మీసేవ కేంద్రంలో నకిలీ స్టాంపులు సృష్టిస్తున్నట్లు గతంలో అతని కారణంగా మీసేవ కేంద్రాలను మూసేసుకున్న వారు తన దృష్టికి తెచ్చారన్నారు. అందుకు ఆధారంగా ఉన్న పత్రాలను వాట్సాప్‌లో పంపడంతో వాటిని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, ఇతర శాఖల అధికారులకు పంపి విచారణ చేయాల్సిందిగా కోరానన్నారు. ఈ–స్టాంపుల ట్యాంపరింగ్ ద్వారా ప్రభుత్వాదాయానికి గండి కొడుతున్నారనే ఉద్దేశంతోనే తాను అధికారులకు సమాచారం ఇచ్చానన్నారు. ప్రభుత్వ ఖజానాకు నష్టం కల్గించిన వారిని వదిలేసి పోలీసులు తనపై ఆరోపణలు చేయడం తగదన్నారు. ఈ విషయంలో న్యాయపరంగా ముందుకు వెళతానన్నారు. రాజకీయంగా తనను దెబ్బతీయడానికి బురద జల్లుతున్నారని, ఈ కుంభకోణంతో తనకు ఎటువంటి సంబంధమూ లేదని స్పష్టం చేశారు.

అధినేతతో భేటీ

అధినేతతో భేటీ