
జోగినాయుడుకు మాజీ సీఎం జగన్ ఫోన్లో పరామర్శ
నాతవరం: సినీ నటుడు, రాష్ట్ర క్రియేటివిటీ కల్చర్ కమిషన్ క్రియేటివ్ మాజీ హెడ్ ఎల్.జోగినాయుడును మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్లో పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రగాఢ సంతాపం తెలిపి మనోధైర్యం కల్పించారు. జోగినాయుడు మాతృమూర్తి సత్యవతి అనారోగ్యం బాధపడుతూ బుధవారం రాత్రి విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆమె అంత్యక్రియలు నాతవరం మండలం చెర్లోపాలెంలో గురువారం నిర్వహించారు. రాష్ట్ర శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ జోగినాయుడును ఫోన్లో పరామర్శించారు. జెడ్పీ చైర్మన్ జి. సుభద్ర, వైస్ చైర్మన్ బి. సత్యవతి జెడ్పీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు దొండా రాంబాబు, గొలుగొండ, పరవాడ, ఎస్.రాయవరం, యలమంచిలి జెడ్పీటీసీ సభ్యులు సుర్ల గిరిబాబు, పైల సన్యాసినాయుడు, కాకర దేవి, వైఎస్సార్‌సీపీ కాకినాడ టౌన్ నాయకుడు గోపాల్, సర్పంచ్ పైల శిరీషా, మాజీ సర్పంచ్ బాబులు, మాజీ ఎంపీటీసీ నాని, గొలుగొండ మండలం సీనియర్ నేత కొల్లి శ్రీనివాస్, సినీ డైరెక్టరు పరశురామ్, పలువురు సీని ప్రముఖలు జోగినాయుడును పరామర్శించారు.