
స్పెషల్ ఒలింపిక్ వాలీబాల్ పోటీల్లో గణేష్ ప్రతిభ
అనకాపల్లి: దివ్యాంగ విద్యార్థులను ప్రోత్సహించి వారిలో నైపుణ్యాలను ఉపాధ్యాయులు వెలికి తీస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారి డాక్టర్ ఆర్.జయప్రకాష్ అన్నారు. జాతీయ స్థాయి స్పెషల్ ఒలింపిక్ భారత్ యూనిఫైడ్ వాలీబాల్ పోటీల్లో గెలుపొంది కాంస్య పతకం సాధించిన మానసిక దివ్యాంగ విద్యార్థి అప్పికొండ గణేష్‌ను సమగ్ర శిక్ష కార్యాలయంలో ఆయన అభినందించారు. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లో గత నెల 15 నుంచి 19వ తేదీ వరకు జరిగిన జాతీయ స్థాయి స్పెషల్ ఒలింపిక్ భారత్ యూనిఫైడ్ వాలీబాల్ పోటీల్లో రావికమతం మండలానికి చెందిన గణేష్ రాణించాడన్నారు. జిల్లా సహిత విద్య సమన్వయ అధికారి ఎల్.గిరిధర్ తదితరులు పాల్గొని గణేష్‌ను అభినందించారు.