టెన్త్‌లో నూరుశాతం ఉత్తీర్ణత లక్ష్యం
డుంబ్రిగుడ: పదోతరగతి పరీక్షల్లో వందశాతం ఉతీర్ణత సాధనే లక్ష్యంగా పాఠశాలల యాజమాన్యం కృషి చేయాలని డీఈవో బ్రహ్మాజీరావు సూచించారు. మంగళవారం ఆయన స్థానిక బాలికల ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. చిన్నారుల విద్యా ప్రగతితోపాటు, వారి మానసిక అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలన్నారు. మెగా తల్లిదండ్రుల సమావేశాన్ని ఉత్సవంలా నిర్వహించే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని అన్నారు. అనంతరం బాలికల ఆశ్రమ పాఠశాలలోని పదోతరగతి విద్యార్థినులతో మాట్లాడారు. పలు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు. దీంతో సంతృప్తి వ్యక్తం చేశారు. ఎంఈవోలు శెట్టి సుందర్‌రావు, జి.గెన్ను పాల్గొన్నారు.


