ఉపాధి అవకాశాలపై దృష్టి సారించాలి
చింతపల్లి: గిరిజన నిరుద్యోగ యువత వృత్తి నైపుణ్య కార్యక్రమాల పట్ల దృష్టి సారించి మంచి ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని సీఆర్‌పీఎఫ్ 234 బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ బి శ్రీనివాసన్ సూచించారు. మంగళవారం చింతపల్లి డివిజన్ పరిధిలో కేంద్ర రిజర్వ్ పోలీసు బలగాలు 234 బెటాలియన్ కమాండెంట్ రమేష్‌కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన నిరుద్యోగ యువతను విశాఖపట్నంలో వృత్తి నైపుణ్య శిక్షణకు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. చింతపల్లి, గూడెం కొత్తవీధి, గుర్తేడు పోలీసుస్టేషన్ల పరిధిలో గల నిరుద్యోగ యువత 40 మందిని వృత్తి నైపుణ్య శిక్షణకు ఎంపిక చేశామన్నారు.వీరికి రెండు నెలలు పాటు ఉచిత భోజన, వసతి సౌకర్యం కల్పించి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. వీరికి బస్సు సౌకర్యం కల్పించి తరలించారు. ఈ కార్యక్రమంలో సీఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ అయ్యప్పన్, సీఐ వినోద్‌బాబు, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
సీఆర్‌పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్
శ్రీనివాసన్


