
ప్రకృతి విశ్వరూపం
ఏజెన్సీలో వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో సాగు చేపట్టేందుకు గిరిజన రైతులు పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. గ్రామాలకు సమీపంలోని కొండల మధ్య భూముల గట్లను సరిచేసి నీటిని నిల్వ చేస్తున్నారు. దీంతో ఎటుచూసినా పచ్చని కొండల మధ్య పొలాలు తటాకాలను తలపించేలా నీటితో కనువిందు చేస్తున్నాయి. మధ్యమధ్యలో ప్రవహించే నీటి గలగలలు.. కలుషితం లేని గాలి.. మనసుకు ఎంతో ఆహ్లాదాన్నిస్తున్నాయి. డ్రోన్ కెమెరాతో ‘సాక్షి’ క్లిక్ చేసిన ఈ అపురూప దృశ్యాలు చూడాలంటే బుంగాపుట్టు పంచాయతీ కొంజిరిగూడ ప్రాంతాన్ని సందర్శించాల్సిందే. – ముంచంగిపుట్టు

ప్రకృతి విశ్వరూపం