
84.69 శాతం మేరపింఛన్ల పంపిణీ
సాక్షి,పాడేరు: జిల్లాలో మంగళవారం సాయంత్రానికి 84.69 శాతం మేరక సామాజిక పింఛన్లను పంపిణీ చేసినట్టు కలెక్టర్ దినేష్‌కుమార్ తెలిపారు. పాడేరు మండలం లగిశపల్లి పంచాయతీ ఉగ్గంగొయ్యి పీవీటీజీ గ్రామంలో పింఛన్ల పంపిణీని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 1,21,659మంది సామాజిక పింఛన్‌దారులకు రూ.51కోట్ల 13లక్షల 96వేల 500 ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. జిల్లాలో పింఛన్ల పంపినీలో ఈనెలలో అన్ని మండలాల కన్నా మారేడుమిల్లి టాప్‌లో ఉందన్నారు. 1904 మంది పింఛనుదారుల్లో తొలిరోజు 99శాతం పంపిణీ చేశారని కలెక్టర్ పేర్కొన్నారు.