
విద్యుత్ వినియోగదారులకు ‘హైవోల్టేజీ’ షాక్
ముంచంగిపుట్టు: మండల కేంద్రంలో ముంచంగిపుట్టులో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల వినియోగదారులకు తీవ్ర నష్టం వాటిల్లింది. హైవోల్టేజీ కారణంగా గృహోపకరాలు, పరికరాలు దగ్ధమయ్యాయి. మంగళవారం హైవోల్టేజి సరఫరా కావడంతో పూర్ణ ఇంటర్నెట్ షాప్‌లో కంప్యూటర్, జెరాక్స్ మెషీన్ కాలిపోయాయి. సుమారు రూ.30 వేల వరకు నష్టం జరిగిందని యజమాని పూర్ణారావు తెలిపారు. ప్రెస్ మార్ట్ షాప్‌లో రెండు ప్రీజ్‌లు, ఇన్వెర్టర్ కాలిపోయాయి. రుత్విక ఫ్యాన్సీ దుకాణంలో ఇంటర్నెట్ మోడమ్, నాలుగు బల్బులు దెబ్బతిన్నాయి. లక్ష్మి, శంకరారావు ఇళ్లల్లో కుక్కర్, ఫ్యాన్, నాలుగు విద్యుత్ బిల్లులు కాలిపోయాయి. పలు చోట్ల స్విచ్ బోర్డుల్లో మంటలు రావడంతో కాలిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న విద్యుత్‌శాఖ అధికారులు మంగళవారం సాయంత్రం విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కు మరమ్మతులు చేపట్టి సమస్య పరిష్కరించారు.
వారం రోజులవుతున్నా..
స్థానిక ఇంజినీరింగ్ కార్యాలయం సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద న్యూట్రల్ వైర్ మరమ్మతులకు గురవడంతో వారం రోజులుగా మండల కేంద్రంలో హైవోల్టేజీ నెలకొంది. విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి సమస్య తీసుకువెళ్లినా పట్టించుకోలేదని పలువురు వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరించడంలో నిర్లక్ష్యం వల్ల తాము నష్టపోవాల్సి వచ్చిందని వారు ధ్వజమెత్తుతున్నారు.
పలుచోట్ల విలువైన గృహోపకరణాలు, పరికరాలు, మెషీన్లు దగ్ధం
అధికారులు సకాలంలో
స్పందించకపోవడం వల్లే నష్టం
పలువురు బాధితుల ఆవేదన

విద్యుత్ వినియోగదారులకు ‘హైవోల్టేజీ’ షాక్

విద్యుత్ వినియోగదారులకు ‘హైవోల్టేజీ’ షాక్