
ఆదివాసీ చట్టాల అమలుకు ఉద్యమం
● ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర
ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను
● యువత ముందుకు రావాలని పిలుపు
చింతూరు: ఆదివాసీ చట్టాల అమలు, హక్కుల సాధనకు యువత ఉద్యమించాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను అన్నారు. మంగళవారం చింతూరులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో అక్రమ కట్టడాలు కూల్చేవరకు ఉద్య మం ఆగదని హెచ్చరించారు. రాజ్యాంగం ఆదివాసీలకు కల్పించిన చట్టాలు, హక్కులు దక్కాలంటే యువత మేలుకోవాలని, గ్రామస్థాయి నుంచి ఉద్యమానికి నాంది పలకాలని కోరారు. అక్రమ కట్టడాల వ్యవహారంలో న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించి అధికారులు సొంత నిర్ణయాలు అమలు చేస్తున్నారని, గిరిజనేతరులకు మద్దతు ఇస్తూ ఏజెన్సీ చట్టాలను అమలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. అధికారులు అక్రమ కట్టడాల కూల్చివేతను త్వరితగతిన పూర్తిచేయాలని లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన తెలిపారు.