
సమాజానికి చేటు
మాదక ద్రవ్యాలతో
● ప్రతి ఒక్కరిపై గంజాయి,
మత్తు పదార్థాల నిర్మూలన బాధ్యత
● కలెక్టర్ దినేష్‌కుమార్,
ఎస్పీ అమిత్ బర్దర్
● పాడేరులో భారీగా అవగాహన ర్యాలీ
పాడేరు : మాదకద్రవ్యాల వినియోగం సమాజానికి తీరని లోటని, నిషేధిత గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలన భాద్యత సమాజంలో ప్రతి ఒక్కరికి ఉందని కలెక్టర్ దినేష్‌కుమార్ అన్నారు. బుధవారం పట్టణంలో నషా ముక్త్ భారత్ అభియాన్ సందర్భంగా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన, మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. ఆర్టీసీ కాంప్లెక్స్, సినిమాహాల్ సెంటర్ మీదుగా పాత బస్టాండ్ వరకు అవగాహన ర్యాలీని స్థానిక ఐటీడీఏ వద్ద కలెక్టర్ దినేష్‌కుమార్, ఎస్పీ అమిత్‌బర్దర్ జెండా ఊపి ప్రారంభించారు. పట్టణంలోని ఆశ్రమ పాఠశాలలు, గిరిజన గురుకులాల విద్యార్థులు, వైద్య విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులతో భారీగా నిర్వహించారు. ఈ సందర్బంగా డ్రగ్స్ వద్దు బ్రో, మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి, విలువైన జీవితాన్ని కాపాడుకోవాలని నినాదాలు చేశారు. పాత బస్టాంద్ వద్ద నిర్వహించిన సభలో కలెక్టర్ మాట్లాడారు. సమాజానికి హాని చేసే మత్తు పదార్థాలపై ప్రజలంతా అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎవరైనా మత్తుకు బానిసైతే పాడేరు జిల్లా ఆస్పత్రిలోని డీఅడిక్షన్ కేంద్రానికి తరలించాలన్నారు. జిల్లా సమాఖ్య, మండల సమఖ్య, స్వయం సహాయక సంఘాలు, పంచాయతీ సమావేశాలు, ఆశ్రమ పాఠశాలలు, యువ గ్రూపులు, సఖీ గ్రూపులలో గంజాయి సాగు, వినియోగానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేయాలన్నారు. ప్రతి 15రోజులకోకసారి గంజాయి సాగు, రవాణ నిర్మూలనపై చర్చ జరగాలన్నారు. ఎస్పీ మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో నషా ముక్త్ అభియాన్ ర్యాలీను విజయవంతం చేశారన్నారు. గత ఏడాది పదివేల ఎకరాల్లో గంజాయి సాగుకు ప్రత్యామ్నాయంగా వాణిజ్య పంటలను సాగు చేసేందుకు విత్తనాలు, మొక్కలను పంపిణీ చేశామన్నారు. స్మగ్లర్లు ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చి స్థానికులను మోసం చేస్తున్నారన్నారు. గంజాయి సమూల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఉన్నతంగా చదువుకొని ఉద్యోగాల్లో స్థిరపడి సమాజానికి ఆదర్శంగా నిలవాలన్నారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ధీరజ్, చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా, ఐసీడీఎస్ పీడీ ఝాన్షీభాయ్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ గౌరీశంకర్‌రావు, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హేమలత, డీఎంహెచ్‌వో డాక్టర్ విశ్వేశ్వర నాయుడు, డీఎస్పీ సహబాజ్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పాల్గొన్నారు.