
రాజేంద్రపాలెం రాంరాం
కొయ్యూరు: మండల కేంద్రంలోని రాజేంద్రపాలెం పీహెచ్‌సీకి వైద్యులు రావడానికి ఆసక్తి చూపడం లేదు. ఇటీవల జరిగిన కౌన్సెలింగ్‌లో ఒక్కరు కూడా రాజేంద్రపాలెం కోరుకోలేదు. ఇక్కడి వైద్యాధికారి సంపత్‌బాబుకు విశాఖ సమీపంలోని ఆస్పత్రికి బదిలీ అయింది. ఆయన స్థానంలో ఎవరిని నియమించలేదు. ప్రస్తుతం యూ.చీడిపాలెం పీహెచ్‌సీ వైద్యాధికారి హేమంత్ డిప్యూటేషన్‌పై రాజేంద్రపాలెం ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. అయితే యూ.చీడిపాలెంలో పనిచేస్తున్న మరో వైద్యాధికారి జయప్రకాశ్‌కు బదిలీ అయింది. దీంతో డిప్యూటేషన్‌లో ఉన్న హేమంత్ యూ.చీడిపాలెం వెళ్లాల్సి ఉంటుంది. ఇదే జరిగితే రాజేంద్రపాలెం పీహెచ్‌సీకి వైద్యుల కొరత ఉంటుంది. దీనిపై పాడేరు ఏడీఎంహెచ్‌వో డాక్టర్ ప్రతాప్‌ను వివరణ కోరగా త్వరలో కొత్త వైద్యుల నియామకానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. వీరిలో వచ్చే వారిని రాజేంద్రపాలెం పీహెచ్‌సీకి కేటాయిం,చి, వైద్యుల కొరత లేకుండా చూస్తామని ఆయన పేర్కొన్నారు.
ఇక్కడి పీహెచ్‌సీని కోరుకోని వైద్యులు
రోగులకు తప్పని ఇబ్బందులు