
మహిళా భక్తుల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు
నేను ఎప్పటికప్పుడు ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయానికి వస్తుంటాను. ఇక్కడ ధారలో స్నానాలు చేసిన అనంతరం దుస్తులు మార్చుకోవడానికి సరైన గదులు లేక ఇబ్బంది పడుతున్నాము. ఎక్కడెక్కడి నుంచో వస్తున్న భక్తులు కూడా అదే ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. మహిళలకు మరుగుదొడ్ల సదుపాయం కూడా లేదు. దూరాభారం నుండి వచ్చే భక్తులకు కనీస మౌలిక వసతులు కల్పన లేకపోవడంతో చెప్పుకోలేని ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది.
–గుడివాడ లక్ష్మి, శివ భక్తురాలు,
కశింకోట గ్రామం