
ఈపీడీసీఎల్ ఆపరేషన్స్ డైరెక్టర్‌గాసూర్యప్రకాష్ బాధ్యత
విశాఖ సిటీ: ఏపీఈపీడీసీఎల్ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా టి.వి.సూర్యప్రకాష్ గురువారం సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. 1986లో ఏపీఎస్‌ఈబీ కేటీపీఎస్‌లో అసిస్టెంట్ ఇంజనీర్‌గా చేరిన ఆయన పలు విభాగాల్లో విధులు నిర్వర్తిస్తూ ఏపీఈపీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ హోదాలో 2021లో పదవీ విరమణ పొందారు. ఆయన తాజాగా ఈపీడీసీఎల్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంతో పాటు రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్‌ను అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అలాగే గ్రామీణ ప్రాంతాలకు 24/7 3–ఫేజ్ విద్యుత్‌ను అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సూర్యప్రకాష్‌ను సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి, డైరెక్టర్లు డి.చంద్రం, టి.వనజ అభినందించారు.