
ఉద్యోగాలు లేక మత్స్యవేటకు...
పరిశ్రమల వ్యర్థ రసాయనాల కారణంగా సముద్రం కాలుష్యం అవడంతో మత్స్య సంపద కోల్పోతున్నాం. యువకులకు స్థానిక పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు కల్పించకపోవడంతో, అలవాటు లేని యువకులు కొంత మంది జీవనోపాధి కోసం మత్స్య వేటకు వెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారు. తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకోగా, పిల్లలు స్థిరపడలేకపోవడం వారిని ఎంతో బాధిస్తోంది. ఇప్పటికై నా ప్రభుత్వాలు తగు చర్యలు చేపట్టి మత్స్యకార యువకులకు స్థానిక పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరుతున్నాను.
–ఉమ్మిడి జగన్, పూడిమడక మత్స్యకార నాయకుడు